: ఇరాక్ లో ఆత్మాహుతి దాడులు... ఆరుగురి మృతి
ఆత్మాహుతి దళాల దాడులతో ఇరాక్ రాజధాని బాగ్దాద్ దద్దరిల్లింది. బాగ్దాద్ లో రెండు వరుస ఆత్మాహుతి దాడులు జరగడంతో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారని అక్కడి అధికార వర్గాలు తెలిపాయి. నిత్యం రద్దీగా ఉండే కర్రాడ ప్రాంతంలో ఈ దాడులు జరిగాయి. దీంతో అక్కడ భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.