: తెలంగాణ రైతుకు ఒక రేటు.. ఆంధ్ర రైతుకు ఒకరేటా?: హరీష్ రావు
పోలవరం ప్రాజక్టుకు సంబంధించి తెలంగాణ రైతులు వివక్షకు గురౌతున్నారని టీఆర్ఎస్ నేత హరీష్ రావు అన్నారు. ప్రాజెక్టు భూసేకరణలో భాగంగా నిర్వాసితులకు అందిస్తోన్న నష్టపరిహారంలో తేడాలున్నాయని ఆయన ఆరోపించారు. ఆంధ్ర రైతుకు ఎకరానికి రూ. 3.50 లక్షలు, తెలంగాణ రైతుకు రూ. 1.15 లక్షలు చెల్లించడం వివక్షకాదా? అంటూ ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. దీనిపై తెలంగాణ మంత్రులు ఎందుకు మాట్లాడరని హరీష్ ప్రశ్నించారు.