: సౌదీని వణికిస్తున్న 'మెర్స్' వైరస్
ప్రస్తుతం సౌదీ అరేబియాను మెర్స్ అనే వైరస్ వణికిస్తోంది. ఈ వైరస్ బారిన పడి నిన్న, మొన్న 10 మంది మృతి చెందారు. ఇప్పటిదాకా ఈ వైరస్ కు గురైన వారి సంఖ్య 511కు చేరుకుంది. కొత్తగా మరో 20 కేసులను గుర్తించారు. ఈ వివరాలను సౌదీ అరేబియా ఆరోగ్య శాఖకు చెందిన అధికారిక వెబ్ సైట్లో పొందుపరిచారు.