: అద్వానీ... ఎన్డీఏ ఛైర్మనా? లేక లోక్ సభ స్పీకరా?


ఎగ్జిట్ పోల్స్ అన్నీ ఎన్డీఏ అధికారంలోకి రాబోతుందని ఘోషిస్తున్న వేళ... మోడీ ప్రధాని అవుతున్నారని బల్లగుద్ది చెబుతున్న వేళ... అందరి దృష్టి బీజేపీ అగ్రనేత అద్వానీపై పడింది. ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన తర్వాత రాజకీయ భీష్ముడు అద్వానీ నిర్వర్తించబోయే పాత్ర ఏమిటనే సందేహం అందర్లోనూ నెలకొంది. అహ్మదాబాద్ లో నిన్న మోడీ, రాజ్ నాథ్, జైట్లీ, గడ్కరీలతో కూడిన బీజేపీ అత్యున్నత కోర్ కమిటీ భేటీ అయింది. ఈ సమావేశంలో సీనియర్ నేతలు అద్వానీ, మురళీ మనోహర్ జోషి లతో పాటు సుష్మాస్వరాజ్ కు ఎలాంటి బాధ్యతలు అప్పగించాలనే దానిపై చర్చించారు.

ఇప్పటి దాకా అందుతున్న సమాచారం ప్రకారం... అద్వానీకి ఎన్డీఏ ఛైర్మన్ పదవిని కట్టబెట్టే అవకాశం ఉంది. లేకపోతే, ఆయనకు అత్యున్నతమైన లోక్ సభ స్పీకర్ పదవిని అప్పగించే అవకాశాలు కూడా ఉన్నాయి. గతంలో డిప్యూటీ పీఎంగా పనిచేసిన అద్వానీకి ఇవ్వడానికి ఇంతకన్నా మంచి పదవులు లేవు. భవిష్యత్తులో ప్రస్తుత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పదవీకాలం ముగిసిన తర్వాత... అద్వానీని రాష్ట్రపతిని చేసే అవకాశాలు కూడా ఉన్నాయి.

  • Loading...

More Telugu News