: అక్కడ వైఎస్సార్సీపీ అభ్యర్థి... కాదు కాదు, టీడీపీ అభ్యర్థే గెలిచాడు!


ఓట్ల లెక్కింపులో అధికారుల నిర్లక్ష్యం ఓ అభ్యర్థి కొంపముంచింది. నెల్లూరు జిల్లాలోని చిత్తమూరు జెడ్పీటీసీ ఓట్ల లెక్కింపులో అధికారులు ఓ వెయ్యి ఓట్లను లెక్కించకుండానే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని విజేతగా ప్రకటించేశారు. రెండు రోజుల తర్వాత నిర్లక్ష్యంగా వదిలివేసిన ఆ వెయ్యి ఓట్ల సంగతి తెలియడంతో వారు నాలిక్కరుచుకున్నారు. ఆ వెయ్యి ఓట్లను కూడా లెక్కపెట్టి... టీడీపీ అభ్యర్థి గెలిచాడంటూ ప్రకటించారు. దాంతో ఈ ఘటనపై జిల్లా కలెక్టర్ విచారణకు ఆదేశించారు.

  • Loading...

More Telugu News