: సీపీఎం రాఘవులకు సవాలు విసిరిన సీపీఐ నారాయణ


వామపక్షాల విభేదాలు రచ్చకెక్కాయి. నువ్వొకటంటే నేను రెండంటా అన్న చందంగా రెండు పార్టీలు కుమ్ములాడుకుంటున్నాయి. ఎవరు అవినీతిపరులో ఖమ్మం జిల్లాలో ప్రజాభిప్రాయం కోరదాం రమ్మని సీపీఎం నేతలకు సీపీఐ నారాయణ సవాలు విసిరారు. నారాయణ వ్యాఖ్యలు జుగుప్సాకరంగా ఉన్నాయన్న రాఘవులు వ్యాఖ్యలపై ఖమ్మంలో ఆయన మాట్లాడుతూ, ఇతర పార్టీలతో సీపీఎం సాగించిన సంబంధాలు సిద్ధాంతాలకే విరుద్ధమన్నారు. కాంగ్రెస్ నుంచి తాను డబ్బు తీసుకున్నానని చెప్పడం పూర్తిగా అవాస్తవమని ఆయన స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News