: వేసవిలో చల్లబడ్డ ద్రవ్యోల్బణం
ఏప్రిల్ నెలలో ద్రవ్యోల్బణం చల్లబడింది. టోకు ధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణం అంతకు ముందు నెలలో ఉన్న 5.7శాతం నుంచి ఏప్రిల్లో 5.2 శాతానికి దిగొచ్చింది. ఆహార వస్తువులు, కూరగాయల ధరలు దిగిరావడంతో ద్రవ్యోల్బణం తగ్గడానికి దోహదపడింది. అలాగే ఉల్లిపాయల ధరలు తగ్గడం కూడా ఉపకరించింది.