: మహిళపై యాసిడ్ పోసి హత్య చేసిన దుండగులు
ప్రకాశం జిల్లా పర్చూరు మండలం తిమ్మరాజుపాలెం సమీపంలో ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. దుండగులు మహిళపై యాసిడ్ పోసి హత్యకు పాల్పడ్డారు. స్థానికుల సమాచారంతో సంఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు దుండగులు రెండు రోజుల క్రితమే మహిళను హత్య చేసి ఉంటారని భావిస్తున్నారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు చేస్తున్నారు.