: ఆరోగ్యశ్రీ చెల్లింపు మొత్తం పెంచాలన్న డిమాండు సరైనదే : మంత్రి డీఎల్
ఆరోగ్యశ్రీ పథకం కింద వివిధ రకాల చికిత్సలకు ప్రభుత్వం ప్రస్తుతం చెల్లిస్తున్న మొత్తాన్ని కనీసం 30 శాతం పెంచాలని ప్రయివేటు ఆసుపత్రుల సంఘం, ఆంధ్రప్రదేశ్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల సంఘం చేసిన డిమాండు సరైనదేనని మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి అన్నారు. ఈ మొత్తాన్ని పెంచాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వం ఆసుపత్రి యాజమాన్యాలు చేస్తోన్న డిమాండ్ పై ఆలోచించాలని డీఎల్ కడపలో అభిప్రాయపడ్డారు.