: పాతబస్తీలో కొనసాగుతున్న కర్ఫ్యూ


రెండు మతవర్గాల మధ్య ఘర్షణలతో హైదరాబాద్ లోని సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో కిషన్ బాగ్, సిక్ చావ్ నీ, ఆర్ష మహల్ ప్రాంతాల్లో విధించిన కర్ఫ్యూ ఈ రోజు కూడా కొనసాగుతోంది. దీంతో ఆ ప్రాంతంలో నిశ్శబ్దం రాజ్యమేలుతోంది. ఎలాంటి చెదురుమదురు ఘటనలు కూడా లేవని, పరిస్థితి ప్రశాంతంగానే ఉందని పోలీసులు తెలిపారు. ఒక మతానికి చెందిన గద్దెను వేరొక మతవర్గం వారు ధ్వంసం చేయడంతో నిన్న ఉదయం ఘర్షణ తలెత్తడం, రాళ్లదాడులు, కత్తిపోట్లకు దారి తీసిన విషయం తెలిసిందే. అల్లరి మూకలను అదుపు చేయడానికి పోలీసులు జరిపిన కాల్పుల్లో ముగ్గురు మృతి చెందారు. కాల్పుల్లోనూ, అల్లరి మూకల దాడుల్లోనూ 10 నుంచి 20 మంది వరకూ గాయపడ్డారు. దీంతో కర్ఫ్యూతోపాటు కొన్ని ప్రాంతాల్లో 144 సెక్షన్ కూడా విధించారు.

  • Loading...

More Telugu News