: డబుల్ డెక్కర్ రైలు తిరుపతి నుంచి హైదరాబాదుకు వచ్చేస్తోంది!
దక్షిణ మధ్య రైల్వే కొత్తగా ప్రవేశపెట్టిన డబుల్ డెక్కర్ రైలు తిరుపతి నుంచి హైదరాబాదులోని కాచిగూడ స్టేషనుకు బయల్దేరింది. ఈ రెండతస్తుల రైలును త్వరలో పదవీ విరమణ చేయనున్న ఆరుగురు రైల్వే సిబ్బంది జెండా ఊపి ప్రారంభించారు. అధునాతన సౌకర్యాలతో ఈ రెండతస్తుల రైలు పట్టాలెక్కిన విషయం విదితమే. ఈ రైలుకు అన్నమయ్య ఎక్స్ ప్రెస్ గా పేరు పెట్టాలని పలువురు ప్రయాణికులు కోరుతున్నారు.