: ప్రపంచంలోనే ఖరీదైన బంగళా మన ముఖేశుడిది


రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేశ్ అంబానీ ఎంతెంతో ఇష్డపడి ముంబైలో నిర్మించుకున్న ఆకాశహార్మ్యంలాంటి భవనం 'ఆంటీలియా' ప్రపంచంలోనే ఖరీదైన బంగళా అని ఫోర్బ్స్ ప్రకటించింది. 27 అంతస్తులతో 4 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణం గల ఈ ఆంటీలియా భవనం ఫోర్బ్స్ ఖరీదైన భవనాల జాబితాలో ప్రథమ స్థానంలో నిలిచింది. దీని నిర్మాణ వ్యయాన్ని 100 కోట్ల నుంచి 200 కోట్ల డాలర్లుగా ఫోర్బ్స్ పేర్కొంది. అంటే సుమారు 12వేల కోట్ల రూపాయలు అన్నమాట. ఈ భవనంలో ఆరు అంతస్తులు కేవలం పార్కింగ్ కే కేటాయించారు. భవనంపై మూడు హెలిప్యాడ్లు ఉన్నాయి. వీటి నిర్వహణ కోసమే 600 మంది పని వారు ఉన్నారు. 11 ఎలివేటర్లు ఉన్నాయి. 2002లో నిర్మాణం ప్రారంభం కాగా, 2010లో పూర్తయింది.

  • Loading...

More Telugu News