: మూడో స్థానంలో బ్యాటింగ్ చేయడమే ఇష్టం: నమన్ ఓజా


మూడో స్థానంలోనే బ్యాటింగ్ చేయడం ఇష్టమని అంటున్నాడు హైదరాబాద్ సన్ రైజర్స్ జట్టు బ్యాట్స్ మన్, వికెట్ కీపర్ నమన్ ఓజా. ఈ స్థానంలోనే కొనసాగాలని కోరుకుంటున్నానని ఓజా తన మనసులో మాటను బయటపెట్టాడు. సరైన భాగస్వామ్యాన్ని నెలకొల్పేందుకు ఇదే సరైన స్థానమనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. 5 లేదా 6 స్థానాల్లో బ్యాటింగ్ కు దిగితే బౌండరీలు తీసేందుకు కష్టమవుతుందని అంటున్నాడు. అదే, టాప్ ఆర్డర్ లో బ్యాటింగ్ కు దిగితే ఇన్నింగ్స్ నిర్మించేందుకు టైం దొరుకుతుందని ఓజా వివరించాడు. బుధవారం నాడు హైదరాబాదులో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తో జరిగిన మ్యాచ్ లో ఓజా అర్ధ సెంచరీ తో రాణించాడు. 36 బంతుల్లో 4 ఫోర్లు, 7 సిక్సర్లతో 79 పరుగులు చేశాడు.

  • Loading...

More Telugu News