: నోరు జారాడు.. జయాగ్రహానికి గురయ్యాడు
మోడీ ప్రధాని అయితే, ఆయనతో జయలలిత కలసి పనిచేస్తారంటూ ప్రకటించిన అన్నాడీఎంకే నేత మలైసామిపై అధినేత్రి జయలలిత కన్నెర్ర జేశారు. పార్టీ నుంచి బహిష్కరించారు. మోడీ, జయలలిత మంచి స్నేహితులని, ఆయన ప్రధాని అయితే, సన్నిహితంగా కలసి పనిచేయవచ్చంటూ మలైసామి నిన్న మీడియాతో అన్నారు.