: ఫలితాల తర్వాత కేసీఆర్ పంచాంగం చెప్పుకోవాల్సిందే: దానం


సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధిస్తుందని మాజీ మంత్రి దానం నాగేందర్ చెప్పారు. ఎవరి మద్దతు లేకుండా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ రోజు హైదరాబాదులోని కాంగ్రెస్ కార్యాలయం గాంధీభవన్ లో దానం మీడియాతో మాట్లాడారు. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అంచనాలకు మించి ఊహించుకుంటున్నారని... ఎక్కువ సీట్లు గెలుస్తామని అంటున్నారని... ఫలితాల తర్వాత కేసీఆర్ పంచాంగం చెప్పుకోవాల్సిందే అని ఎద్దేవా చేశారు.

  • Loading...

More Telugu News