: పదో తరగతి ఫలితాల్లో తూగోజీ టాప్... ఆదిలాబాద్ లాస్ట్


పదో తరగతి పరీక్ష ఫలితాలు వెలువడ్డాయి. రాష్ట్రం మొత్తం మీద తూర్పుగోదావరి జిల్లాలో అత్యధిక విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. 96.26 ఉత్తీర్ణత శాతంతో తూర్పు గోదావరి జిల్లా సత్తా చాటింది. తర్వాతి స్థానాల్లో కడప, వరంగల్ జిల్లాలు నిలిచాయి. 58.31 శాతం ఉత్తీర్ణతతో ఆదిలాబాద్ జిల్లా చివరి స్థానంలో నిలిచింది. 77 పాఠశాలల్లో సున్నా శాతం ఉత్తీర్ణత నమోదయింది. 5,784 పాఠశాలలు 100 శాతం ఉత్తీర్ణత సాధించాయి. పోయిన ఏడాది కంటే ఈ ఏడాది 0.54 శాతం ఉత్తీర్ణత పెరిగింది. 10 రోజుల్లో టెన్త్ మార్కుల జాబితాలు లభ్యమవుతాయి.

  • Loading...

More Telugu News