: ప్రధానికి వీడ్కోలు విందు... రాహుల్ డుమ్మా?
ప్రధాని మన్మోహన్ సింగ్ కు కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ వీడ్కోలు విందు ఇవ్వగా, దానికి రాహల్ గాంధీ హాజరు కాకపోవడం విమర్శలకు దారి తీసింది. పదేళ్ల పాటు కాంగ్రెస్ ఆధ్వర్యంలోని యూపీఏ ప్రభుత్వానికి సారధిగా వ్యవహరించిన మన్మోహన్ సింగ్ పదవి నుంచి దిగిపోతున్న తరుణంలో సోనియా నిన్న విందు ఇచ్చారు. మరి ఇంత ముఖ్యమైన కార్యక్రమానికి రాహుల్ హాజరు కాకపోవడం వెనుక మర్మమేంటో అని కాంగ్రెస్ పార్టీ వర్గాలే చర్చించుకుంటున్నాయి. అయితే, రాహుల్ కార్యాలయం మాత్రం ఆయన నగరంలో లేరని, ప్రధానిని రాహుల్ లోగడే కలసి కృతజ్ఞతలు చెప్పారని ప్రకటన జారీ చేసింది.