: ఉస్మానియా మెడికల్ కాలేజీకి అదనంగా మరో 50 ఎంబీబీఎస్ సీట్లు
హైదరాబాదులోని ఉస్మానియా మెడికల్ కాలేజీకి అదనంగా మరో 50 ఎంబీబీఎస్ సీట్లను కేటాయించారు. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఈ విషయాన్ని తెలిపింది. ప్రస్తుతం ఈ కళాశాలకు 200 ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయి. పెరిగిన సీట్లతో మొత్తం సీట్ల సంఖ్య 250కి చేరింది.