: అమెరికా రోడ్డు ప్రమాదంలో ఇద్దరు తెలుగు యువకుల మృతి
అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు తెలుగు యువకులు మృతి చెందారు. వీరిని హైదరాబాద్ నేరేడ్ మెట్ లోని మధురానగర్ కు చెందిన శరత్ (25), కర్నూలు జిల్లా నంద్యాలకు చెందిన మోకా మల్లికార్జున (24)గా గుర్తించారు. వీరిద్దరితో పాటు చెన్నైకి చెందిన జిగ్నేష్ అనే వ్యక్తి కూడా మృతి చెందారు. వర్జీనియాలో వీరు ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి డివైడర్ ను ఢీకొంది. ఆగి ఉన్న లారీని తప్పించబోయే ప్రయత్నంలో ఈ దుర్ఘటన జరిగిందని అక్కడి పోలీసులు తెలిపారు.