: నా భర్తను విడుదల చేయండి: 'ఢిల్లీ వర్సిటీ' సాయిబాబా భార్య వసంత
ఢిల్లీలోని సెంట్రల్ యూనివర్సిటీలో అరెస్టయిన తన భర్త, ఆచార్య సాయిబాబాను విడుదల చేయాలని అతని భార్య వసంత ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. తన భర్తకు న్యాయసహాయం అందకుండా చేసేందుకు పోలీసులు ఆయనను మహారాష్ట్ర తీసుకెళ్లారని ఆమె ఆరోపించారు. వికలాంగుడైన తన భర్తకు పోలీసులు కనీస సౌకర్యాలు కల్పించడం లేదని ఆమె తీవ్రంగా విమర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి సరిగా లేదని ఆవేదన వ్యక్తం చేసిన ఆమె, తక్షణం తన భర్తను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.