: నకిలీ వ్యాపారాలతో స్పెయిన్ ప్రభుత్వాన్ని మోసం చేస్తున్న 740 మంది అరెస్టు
వ్యాపారాలు నిర్వహిస్తున్నామంటూ స్పెయిన్ ప్రభుత్వంలో రాయితీలు పొందుతున్న వారిపై పోలీసులు నిఘా పెట్టారు. వారి నకి'లీలలు' బయటపెట్టి కటకటాల వెనక్కినెట్టారు. స్పెయిన్ లో నకిలీ వ్యాపార వ్యవహారాలతో ప్రభుత్వాన్ని మోసం చేస్తున్న740 మందిని అక్కడి పోలీసులు అరెస్టు చేశారు. ప్రభుత్వ రాయతీలు పొందేందుకు 135 నకిలీ కంపెనీలు నిర్వహిస్తూ వీరు లబ్ది పొందుతున్నారు.
వ్యాపార సంస్థలు నిర్వహిస్తున్నామనే సాకుతో నివాసాలకు అనుమతులు పొందుతూ, రాయితీలు అనుభవిస్తున్నారని పోలీసులు తెలిపారు. ఎలాంటి వ్యాపారం లేకుండానే నిరుద్యోగులకు అవకాశం కల్పించామని లెక్కలు చూపించిన 30 మంది మేనేజర్లను పోలీసులు అరెస్టు చేశారు. నకిలీ వ్యాపార వ్యవహారాలు బట్టబయలు చేసేందుకు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చిందని అక్కడి పోలీసులు తెలిపారు.