: సడక్ బంద్ కేసులో కోర్టుకు హాజరైన టీజేఏసీ, టీఆర్ఎస్ నేతలు
తెలంగాణ పొలిటికల్ జేఏసీ నేతలు కోదండరామ్, శ్రీనివాస్ గౌడ్.. టీఆర్ఎస్ నేతలు ఈటెల రాజేందర్, జూపల్లి కృష్ణారావు, జితేందర్ రెడ్డి ఈ ఉదయం మహబూబ్ నగర్ జిల్లా ఆలంపూర్ కోర్టుకు హాజరయ్యారు. గతనెలలో హైదరాబాద్-కర్నూల్ జాతీయ రహదారిపై టీ జేఏసీ - టీఆర్ఎస్ సడక్ బంద్ నిర్వహించిన సంగతి విదితమే. ఈ సందర్భంగా వీరిని అరెస్టు చేసిన మహబూబ్ నగర్ పోలీసులు కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచారు. అనంతరం వీరంతా బెయిల్ పై విడుదలైన సంగతి తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి ఇవాళ కోర్టు వాయిదా ఉండటంతో నేతలు కోర్టు ముందు హాజరయ్యారు.