: జగన్ ను ప్రజలు ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటున్నారు: మైసూరారెడ్డి
వైఎస్సార్సీపీ అధినేత జగన్ ను ముఖ్యమంత్రిగా చూడాలని ఆంధ్రప్రదేశ్ ప్రజలు కోరుకుంటున్నారని ఆ పార్టీ సీనియర్ నేత ఎంవీ మైసూరారెడ్డి అన్నారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ లో వచ్చేది జగన్ ప్రభుత్వమేనని అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ, టీడీపీ మధ్య ఓట్ల శాతంలో తేడా ఉందని, స్థానిక సంస్థల ఎన్నికలకు, సార్వత్రిక ఎన్నికలకు మధ్య చాలా మార్పులు సంభవించాయని ఆయన అన్నారు.
రాజకీయ సన్యాసం పుచ్చుకున్న లగడపాటికి సర్వేలతో పనేంటని ఆయన ప్రశ్నించారు. ఆయన సర్వేలు బెట్టింగుల కోసమేనని ఆయన అభిప్రాయపడ్డారు. ఆంధ్రప్రదేశ్ లో వైఎస్సార్సీపీకి 110 నుంచి 125 అసెంబ్లీ స్థానాలు, 20కి పైగా ఎంపీ సీట్లు వస్తాయని మైసూరా తెలిపారు.