: సర్వేలు ఏం చెప్పినా విజయం టీడీపీదే: కంభంపాటి


సర్వేలు ఏం చెప్పినా ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ విజయం సాధిస్తుందని ఆ పార్టీ నేత కంభంపాటి రామ్మోహన్ రావు తెలిపారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, సీమాంధ్ర ప్రజలు అభివృద్ధిని కోరుకుంటున్నారని అన్నారు. ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణం చంద్రబాబు నాయుడుతోనే సాధ్యమని ప్రజలు భావిస్తున్నారని ఆయన తెలిపారు. టీడీపీ హయాంలో ప్రవేశపెట్టిన సంక్షేమ కార్యక్రమాలే ఆ పార్టీకి శ్రీరామరక్షగా నిలిచాయని ఆయన అభిప్రాయపడ్డారు. అభివృద్ధికి-అవినీతికి మధ్య జరిగిన ఎన్నికల్లో ప్రజలు అభివృద్ధికే పట్టం కట్టారని అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో 70 శాతం, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో 65 శాతం టీడీపీ కైవసం చేసుకోవడం సంతోషాన్నిచ్చిందని ఆయన వెల్లడించారు.

  • Loading...

More Telugu News