: టీవీ నటిని లైంగికంగా, ఆర్థికంగా దోచుకున్న బాబా అరెస్ట్
'శారీరకంగా, మానసికంగా తీవ్ర ఒత్తిడికి గురవుతున్నాను... స్వస్థత చేకూర్చండి' అంటూ వచ్చిన ఓ టీవీ నటిని ఓ బాబా దారుణంగా వంచించాడు. ఈ ఘటన ముంబైలో జరిగింది. తనను నమ్మి వచ్చిన ఆమెను (27 ఏళ్లు) దయ్యం పట్టిందంటూ, క్షుద్రపూజలు చేయాలంటూ బాబా ఇస్మయిలీ ఖాసిం ఖాన్ (35) భయపెట్టాడు. దీంతో భయపడిపోయిన ఆమె... ఖాసిం చెబుతున్నవన్నీ చేయడం ప్రారంభించింది. ఈ క్రమంలో ఆమె దగ్గర్నుంచి ఖాసిం ఏకంగా రూ. 25.70 లక్షలు కాజేశాడు. అంతే కాకుండా, ఆమెను లైంగికంగా కూడా లోబరుచుకున్నాడు. కొంతకాలం గడచిన తర్వాత తాను మోసపోయానని గ్రహించిన ఆ టీవీ నటి చివరకు పోలీసులను ఆశ్రయించింది. ఆమె ఫిర్యాదుతో దొంగ బాబాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.