: నారాయణ మాటలు జుగుప్సాకరం: రాఘవులు
తనను ఓడించేందుకు సీపీఎం నేత తమ్మినేని వీరభద్రం వైకాపా నుంచి రూ. 15 కోట్లు తీసుకున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై సీపీఎం నేత రాఘవులు మండిపడ్డారు. నారాయణ వ్యాఖ్యలు జుగుప్సాకరంగా ఉన్నాయని... అసందర్భంగా, అనవసరంగా ఇష్టమొచ్చినట్టు మాట్లాడారని అన్నారు. ఆయన మాటలకు ఏవైనా ఆధారాలుంటే బయటపెట్టాలని డిమాండ్ చేశారు. ఊహాజనితంగా విమర్శలు చేయడం కమ్యూనిస్టులు చేసే పని కాదని నారాయణకు సూచించారు. తాము మిత్ర ద్రోహానికి పాల్పడలేదని... కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోకపోతే తాము సీపీఐకి మద్దతు ఇచ్చేవారమని తెలిపారు. ఇకనైనా నారాయణ తప్పుడు ఆరోపణలు మానుకోవాలని సలహా ఇచ్చారు.