: ఎంఐఎం, మేము మిత్రులం: పొన్నాల
ఎంఐఎం పార్టీ తమ మిత్రపక్షమని తెలంగాణ పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య తెలిపారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, ఎంఐఎం తమకు మిత్రులుగానే ఉంటారని విశ్వాసం వ్యక్తం చేశారు. మిత్రులతో తమకు మంచి అవగాహన ఉందని ఆయన అన్నారు. తెలంగాణలో వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని ఆయన స్పష్టం చేశారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో ఓట్ల శాతంలో తమదే ముందంజ అని పొన్నాల చెప్పారు. లగడపాటి ఎగ్జిట్ పోల్స్ పై తాను మాట్లాడనని పొన్నాల స్పష్టం చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో చేసిన చట్టాలను సమీక్షించి మార్పులు చేస్తామని, అందుకు సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి ఆధ్వర్యంలో ప్రత్యేక కమిటీ వేస్తామని ఆయన తెలిపారు.