: వరంగల్ జిల్లాలో ప్రారంభమైన క్యాంపు రాజకీయాలు
వరంగల్ జిల్లా జెడ్పీటీసీ ఫలితాల్లో ఏ పార్టీకీ మెరుగైన ఫలితాలు రాకపోవడంతో... కాంగ్రెస్ పార్టీ క్యాంపు రాజకీయాలు షురూ చేసింది. వరంగల్ లోని జీఎంఆర్ గార్డెన్స్ లో గండ్ర వెంకటరమణారెడ్డి, బసవరాజు సారయ్యలు మకాం వేశారు. జడ్పీలను కాపాడుకునేందుకు వారు చర్యలను ప్రారభించారు. ఈ జిల్లాలో కాంగ్రెస్ 24 జడ్పీటీసీలను గెలుపొందగా టీఆర్ఎస్ 18, టీడీపీ 6, ఇతరులు 2 స్థానాలను గెలుచుకున్నారు.