: 7న అంబేద్కర్ ఓపెన్ యూనివర్శిటీ ఎంట్రన్స్ ఎగ్జామ్
చదువుకోవాలనే కోరిక ఉండి, ఏవైనా కారణాలవల్ల కళాశాలలకు వెళ్లలేని వారికి, ఉన్నత విద్యావకాశాలను కల్పించే ఉద్దేశ్యంతో నెలకొల్పబడిందే డా. బిఆర్.అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం. ఈ ఓపెన్ యూనివర్శిటీ వివిధ కోర్సుల్లో ప్రవేశానికి ఈనెల 7వ తేదీన ఎంట్రన్స్ ఎగ్జామ్ నిర్వహించనుంది. రాష్ట్ర వ్యాప్తంగా 215 అధ్యయన కేంద్రాల్లో ఈ పరీక్ష జరుగుతుంది.
వివిధ పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లను అభ్యర్థులు www.braou.ac.in లేదా www.aponline.gov.in అనే వెబ్ సైట్ల నుండి డౌన్ లౌడ్ చేసుకోవచ్చని విశ్వవిద్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. అంతేకాదు. ఈ ఏడాది నుంచి కొత్తగా నెల్లూరు సెంట్రల్ జైల్లో అధ్యయన కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు వెల్లడించింది.