: అద్వానీ భవితవ్యంపై సరైన సమయంలో నిర్ణయం: గడ్కరీ
బీజేపీ అగ్రనేత లాల్ కృష్ణ అద్వానీ సేవలు ఎలా వినియోగించుకోవాలో తగిన సమయంలో నిర్ణయిస్తామని ఆ పార్టీ మాజీ అధ్యక్షుడు నితిన్ గడ్కరీ స్పష్టం చేశారు. పార్టీ పార్లమెంటరీ బోర్డు సమావేశమై దీనిపై నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. వాజ్ పేయి, అద్వానీ బీజేపీ వ్యవస్థాపకులని, అద్వానీ మార్గదర్శకత్వం తమకు అవసరమని వివరించారు.