: దక్షిణ కాలిఫోర్నియాలో కార్చిచ్చు
దక్షిణ కాలిఫోర్నియాలోని అడవుల్లో కార్చిచ్చు మొదలైంది. నిన్న మధ్యాహ్నం మొదలైన కార్చిచ్చు ధాటికి శాన్ డియాగో పట్టణం సరిహద్దుల్లో 5వేల నివాసాలను ఖాళీ చేయించారు. మంటలు అదుపులోకి వచ్చినట్లు శాన్ డియాగో అగ్నిమాపక విభాగం చీఫ్ జేవియర్ మైనార్ మీడియాకు తెలిపారు. అయితే, రాత్రి సమయానికి 800 ఎకరాలు అగ్నికి ఆహుతి అయినట్లు అధికారులు ప్రకటించారు. ఉష్ణోగ్రతలు తారస్థాయికి చేరడమే ఈ ప్రమాదానికి కారణంగా భావిస్తున్నారు. ఆస్తి, ప్రాణ నష్టం జరిగినట్లు సమాచారం లేదు.