: ఎన్డీయేకు జయ స్నేహ హస్తం
కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వమే ఏర్పాటు కానుందన్న అంచనాల నేపథ్యంలో... తాము మద్దతిస్తామంటూ పార్టీలు క్యూ కడుతున్నాయి. ఇప్పటికే షరతులతో కూడిన మద్దతిస్తామని ఒడిశాలోని అధికార బీజూ జనతాదళ్ ప్రకటించగా... తమిళనాడుకు చెందిన అధికార అన్నాడీఎంకే కూడా అదే బాటలో అడుగు వేసింది. బీజేపీ సారధ్యంలోని ఎన్డీయే ప్రభుత్వంలో చేరే అవకాశాలున్నాయని అన్నాడీఎంకే నేత కె.మలైసామి సంకేతాలు ఇచ్చారు. తమిళనాడు సీఎం జయలలిత, గుజరాత్ సీఎం మోడీ మంచి స్నేహితులని, మోడీ ప్రధాని అయితే, వారు కలసి పనిచేయవచ్చని చెప్పారు.