: ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించాం: రమాకాంత్ రెడ్డి
స్థానిక సంస్థల ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించామని... సహకరించిన అధికారులందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నామని రాష్ట్ర ఎన్నికల అధికారి రమాకాంత్ రెడ్డి తెలిపారు. ఎన్నికల కోసం కర్ణాటక నుంచి 20 వేలు, ఒడిశా నుంచి 8 వేలు, తమిళనాడు నుంచి 7 వేల బ్యాలెట్ బాక్సులు తెచ్చామని తెలిపారు. పశ్చిమగోదావరి, నెల్లూరు జిల్లాలలో చెదలుపట్టిన, తడిసిపోయిన బ్యాలెట్ పత్రాల లెక్కింపును పూర్తి చేసి... ఫలితాలను కూడా వెల్లడించామని చెప్పారు.