: రాజేంద్రనగర్ ఎవరూ రావద్దు: సైబరాబాద్ కమిషనర్
హైదరాబాదులోని రాజేంద్రనగర్లో కర్ఫ్యూ విధించారు. రాజేంద్రనగర్ లోని కిషన్ బాగ్ ప్రాంతంలో రెండు వర్గాల మధ్య ఘర్షణ తలెత్తింది. ఇరువర్గాలు పరస్పరం రాళ్ల దాడి చేసుకున్నాయి. తక్షణం రంగంలోకి దిగిన పోలీసులు రాజేంద్రనగర్ లో కర్ఫ్యూ విధించి, చుట్టుపక్కల ప్రాంతాల్లో గస్తీ పెంచారు. ఈ సందర్భంగా సైబరాబాద్ నగర కమిషనర్ సీవీ ఆనంద్ మాట్లాడుతూ, ప్రజలు సంయమనం పాటించాలని సూచించారు. ప్రజలు, రాజకీయ నేతలు కిషన్ బాగ్ పరిసర ప్రాంతాల వైపు రావద్దని విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతానికి పరిస్థితి అదుపులోనే ఉందని, ఎవరైనా రావడం వల్ల శాంతిభద్రతల సమస్య తలెత్తే అవకాశం ఉందని ఆయన అన్నారు.