: శ్రీకాకుళం 'కిమ్స్' వద్ద ఆసుపత్రి సిబ్బంది, మున్సిపల్ ఉద్యోగుల మధ్య ఉద్రిక్తత
శ్రీకాకుళంలోని 'కిమ్స్' ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత నెలకొంది. టౌన్ప్లానింగ్ విభాగం నిర్దేశించిన నిబంధనలకు విరుద్ధంగా కిమ్స్ ఆసుపత్రి సెల్లార్ నిర్మాణం జరిగిందంటూ మున్సిపల్ సిబ్బంది సెల్లార్ కూల్చివేసేందుకు సమాయత్తమయ్యారు. ఈ సందర్భంగా మున్సిపల్ సిబ్బందిని ఆసుపత్రి సిబ్బంది ప్రతిఘటించారు. దీంతో ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఇరువర్గాలను శాంతింపజేసేందుకు పోలీసులు సర్దిచెబుతున్నారు.