: జడ్పీ చైర్మన్ ఎన్నికల్లో ఎంపీ, ఎమ్మెల్యేలకు ఓటు హక్కు లేదు: రమాకాంత్ రెడ్డి
జిల్లా పరిషత్ చైర్మన్ ఎన్నికల్లో ఎంపీ, ఎమ్మెల్యేలకు ఓటు హక్కు లేదంటూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమాకాంత్ రెడ్డి బాంబు పేల్చారు. అలాగే, మండలపరిషత్ అధ్యక్ష ఎన్నికల్లోనూ వారికి ఓటు హక్కు లేదని చెప్పారు. ఆయా ఎన్నికల్లో ఎంపీటీసీ, జడ్పీటీసీలకే ఓటు హక్కు అని తేల్చి చెప్పారు.