: వీరికి ఒక్క ఓటు కూడా పడలేదు


ఏ ఎన్నికల్లో అయినా పోటీ చేసే అభ్యర్థికి కనీసం కుటుంబ సభ్యుల ఓట్లైనా పడతాయి. కుటుంబ సభ్యులు వ్యతిరేకించినా... తన సొంత ఓటైనా తనకు వేసుకుంటారు. కానీ, పరిషత్, పురపాలక ఎన్నికల ఫలితాల్లో కొన్ని చోట్ల విచిత్రమైన ఫలితాలు వచ్చాయి. కొంత మంది అభ్యర్థులకు కనీసం ఒక్క ఓటు కూడా పడలేదు. అంటే వారి సొంత ఓటును కూడా తమకు వేసుకోకుండా ఇతరులకు వేశారన్న మాట. ఇల్లెందు పురపాలక సంఘంలోని 14వ వార్డు నుంచి వైకాపా తరపున పోటీ చేసిన సంజయ్ కుమార్ కు ఒక్క ఓటు కూడా పడలేదు. అదే విధంగా సిరిసిల్ల 11వ వార్డులోని స్వతంత్ర అభ్యర్థి కుసుమ చంద్రశేఖర్, హుస్నాబాద్ మున్సిపాలిటీలోని బీఎస్సీ అభ్యర్థి సుధాకర్ లు కూడా తమ ఖాతాను తెరవలేకపోయాయి.

  • Loading...

More Telugu News