: సీమాంధ్రలో కొనసాగుతున్న టీడీపీ ఆధిక్యత
సీమాంధ్రలో జెడ్పీటీసీ, ఎంపీటీసీల ఫలితాల్లో టీడీపీ తన ఆధిక్యతను అంతకంతకూ పెంచుకుంటూ పోతోంది. ఇప్పటి వరకు వెల్లడైన ఫలితాల ప్రకారం... టీడీపీ 5017 ఎంపీటీసీ స్థానాలను గెలుపొందగా, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 3977 స్థానాల్లో విజయం సాధించింది. కాంగ్రెస్ 139, వామపక్షాలు 38, ఇతరులు 421 స్థానాల్లో గెలుపొందారు.
ఇక, జడ్పీటీసీల విషయానికొస్తే... టీడీపీ 334 స్థానాలను కైవసం చేసుకోగా, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 231 స్థానాల్లో విజయం సాధించింది. కాంగ్రెస్ పార్టీ ఒక స్థానంలో గెలుపొందింది.