: గెలిచినా, ఓడినా అమేథీలోనే ఉంటా: కుమార్ విశ్వాస్
ఎన్నికల్లో గెలిచినా, ఓడినా అమేథీలోనే ఉంటానని ఆమ్ ఆద్మీ పార్టీ లోక్ సభ అభ్యర్థి కుమార్ విశ్వాస్ ఇవాళ స్పష్టం చేశారు. "నిర్ణయం ఎలా ఉన్నా అమేథీని వీడే ప్రసక్తి లేదు. అమేథీలోని దళారుల వ్యవస్థను ధ్వంసం చేసేవరకు నా ప్రచారం కొనసాగుతుంది" అని ఆయన చెప్పారు. అమేథీలో విజేత ఎవరైనా ఈ ప్రజల హృదయాలను మాత్రం తాను గెలుచుకున్నానని ఆయన అన్నారు.
అమేథీ నియోజకవర్గంలో దాదాపు 17 వేల మంది ఏఏపీ సభ్యులుగా చేరారని, సామాన్యుడు ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించడానికి బ్లాక్ స్థాయిలో పార్టీకి శాశ్వత కార్యాలయాలు ఏర్పాటు చేస్తామని కుమార్ విశ్వాస్ చెప్పారు. ఏ వ్యక్తిని కాని, పార్టీని కాని లక్ష్యంగా చేసుకోకుండా సమాజ శ్రేయస్సు కోసం ఆమ్ ఆద్మీ కార్యకర్తలు పనిచేస్తారని ఆయన చెప్పారు.