: బాగ్దాద్ లో కారు బాంబు పేలుళ్లు... 21 మంది మృతి
ఇరాక్ రాజధాని బాగ్దాద్ లో వరుస కారు బాంబు పేలుళ్లు సంభవించాయి. ఇవాళ జరిగిన ఈ దాడుల్లో కనీసం 21 మంది మరణించగా, మరో 82 మంది గాయపడ్డారు. బాగ్దాద్ తూర్పు ప్రాంతంలో ఏడు కార్లలో అమర్చిన బాంబులను వరుసగా పేల్చినట్లు అధికారులు తెలిపారు. ఇందులో ఆత్మాహుతి దళాలు కూడా పాల్గొన్నట్టు అధికారులు చెప్పారు.