: తెలంగాణలో కాంగ్రెస్ 982, టీఆర్ఎస్ 846


తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగుతోంది. ఇప్పటిదాకా వెల్లడైన ఫలితాల ప్రకారం... 982 ఎంపీటీసీ స్థానాల్లో కాంగ్రెస్ గెలుపొందగా, టీఆర్ఎస్ 846 స్థానాలను కైవసం చేసుకుంది. టీడీపీ 391 స్థానాలతో మూడో స్థానంలో ఉంది. వామపక్షాలు 99 ఎంపీటీసీీలను కైవసం చేసుకోగా, ఇతరులు 441 స్థానాల్లో జయకేతనం ఎగరవేశారు.

జడ్పీటీసీల్లో మాత్రం టీఆర్ఎస్ ముందంజలో ఉంది. ఇప్పటిదాకా 47 జడ్పీ స్థానాలను కారు సొంతం చేసుకోగా, 24 స్థానాలతో కాంగ్రెస్ ద్వితీయ స్థానంలో ఉంది. టీడీపీ 4, ఇతరులు 1 స్థానంలో గెలుపొందారు.

  • Loading...

More Telugu News