: పోలీసులపై దాడికి దిగిన కార్యకర్తలు... ఓట్ల లెక్కింపు కేంద్రం వద్ద ఉద్రిక్తత
హైదరాబాదు శివారులోని రంగారెడ్డి జిల్లా ఘట్ కేసర్ లో ఓట్ల లెక్కింపు కేంద్రం వద్ద ఉద్రిక్తత నెలకొంది. అక్కడ గుంపులు గుంపులుగా ఉన్న కార్యకర్తలను చెదరగొట్టేందుకు పోలీసులు ప్రయత్నించారు. దీంతో ఆగ్రహించిన కార్యకర్తలు పోలీసులపై ఎదురుదాడికి దిగారు. ప్రస్తుతం అక్కడ ఉద్రిక్తత చోటుచేసుకుంది.