: ఆంధ్రప్రదేశ్ రాజధానిగా విశాఖ అత్యుత్తమం: సుబ్బరామిరెడ్డి


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విశాఖపట్టణాన్ని రాజధానిగా చేయాలని కాంగ్రెస్ ఎంపీ టి.సుబ్బరామిరెడ్డి డిమాండ్ చేశారు. విశాఖలో ఆయన మాట్లాడుతూ, ఒక రాజధానికి కావాల్సిన మౌలిక వసతులన్నీ విశాఖలో ఉన్నాయని అన్నారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం నియమించిన శివరామకృష్ణన్ కమిటీకి ఒక నివేదిక సమర్పించానని ఆయన తెలిపారు.

సువిశాల ఆంధ్రప్రదేశ్ లో హైదరాబాద్ తరువాత అతిపెద్ద నగరం విశాఖ అని, ఇక్కడ అన్ని వసతులు ఉన్నాయని అన్నారు. రోడ్డు, రైలు, విమానయాన రవాణా మార్గాలు, భూమి, నీటి వనరుల లభ్యత తదితర అంశాల పరంగా చూస్తే విశాఖే రాజధానికి అనువైన ప్రాంతమని ఆయన అభిప్రాయపడ్డారు.

  • Loading...

More Telugu News