: నడుస్తున్న వారిపై నుంచి దూసుకెళ్లిన కారు


ఉత్తరప్రదేశ్ లోని నాన్ పురా సమీపంలోని బేచాయ్ పుర్వా గ్రామంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రోడ్డు పక్కన నడుస్తున్న వారిపై నుంచి వేగంగా వెళ్తున్న జీపు దూసుకెళ్లడంతో ఎనిమిది మంది మృతి చెందగా, మరో ఆరుగురు గాయాలపాలయ్యారని డిప్యూటీ ఎస్పీ అస్లామ్ ఖాన్ తెలిపారు. కాగా జీపు డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డాడని ఆయన చెప్పారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించిన పోలీసులు, డ్రైవర్ పై కేసు నమోదు చేశారు.

  • Loading...

More Telugu News