: ఎవరి పని వారిదే... ఓ వైపు ఓట్ల లెక్కింపు... మరోవైపు విభజన లెక్కింపు
రాష్ట్రంలో ఓట్ల లెక్కింపు, గెలుపోటముల వేడి రాజుకుంటోంది. మరో వైపు రాష్ట్ర విభజనకు రంగం సిద్ధమవుతోంది. పోలీసు శాఖలో ఉద్యోగుల విభజన, ఇతర అంశాలపై శాఖాపరంగా తీసుకున్న నిర్ణయాలను రాష్ట్ర డీజీపీ ప్రసాదరావు, కేంద్ర హోం శాఖ కార్యదర్శి అనిల్ గోస్వామికి లేక్ వ్యూ అతిథిగృహంలో వివరించారు. రెండు రాష్ట్రాల ప్రజలకు సమర్థవంతమైన సేవలు అందించేందుకు చేపట్టిన చర్యలను విశదీకరించారు. పాలనాపరమైన ఇబ్బందులు తలెత్తకుండా రెండు రాష్ట్రాల డీజీపీ కార్యాలయాల నిర్వహణకు భవనాల కేటాయింపు పూర్తి చేసినట్టు తెలిపారు.