: ఈ నెల 16 వరకు కేదార్ నాథ్ యాత్ర నిలిపివేత
మే 16వ తేదీ వరకు కేదార్ నాథ్ యాత్రను నిలిపివేశారు. హిమాలయాల్లో విపరీతంగా మంచు కురుస్తుండడం, తరచుగా వర్షాలు పడటంతో చార్ ధామ్ యాత్రకు అంతరాయం ఏర్పడుతోంది. కేదార్ నాథ్ యాత్రను ఈ నెల 16వ తేదీ వరకు, బద్రీనాథ్ యాత్రను తాత్కాలికంగా నిలిపివేశారు. ఈ ప్రాంతాల్లో భారీ హిమపాతం కారణంగా యాత్రను నిలిపివేశామని, ప్రయాణికులు ఓపిక పట్టాలని బద్రీనాథ్ - కేదార్ నాథ్ టెంపుల్ కమిటీ సీఈవో శర్మ తెలిపారు.