: కొల్చారం జడ్పీటీసీ కాంగ్రెస్... కోనరావుపేట టీఆర్ఎస్
తెలంగాణలోని పరిషత్ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ తొలి జడ్పీటీసీ బోణీ కొట్టింది. మెదక్ జిల్లా కొల్చారం జడ్పీటీసీ స్థానాన్ని హస్తగతం చేసుకుంది. ఇక జడ్పీటీసీల్లో టీఆర్ఎస్ కూడా బోణీ కొట్టింది. కరీంనగర్ జిల్లా వేములవాడ నియోజకవర్గం కోనరావుపేట జడ్పీటీసీ స్థానంలో కారు పార్టీ విజయం సాధించింది.