: నా కుమార్తె కోసం నా కెరీర్ వదులుకునేందుకు సైతం వెనుకాడను: పేస్


తన కుమార్తె కోసం తన కెరీర్ ను వదులుకునేందుకు కూడా వెనుకాడనని టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్ తెలిపాడు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ, తన భార్య తనపై చేస్తున్న ఆరోపణలు, ఫిర్యాదులన్నీ అవాస్తవాలని అన్నాడు. తన కూతురి సంరక్షణ పిటిషన్ లో తాను పేర్కొన్న ప్రతీ అంశంపై డాక్యుమెంటరీ ఆధారాలున్నాయని పేస్ స్పష్టం చేశాడు. కోర్టులో తనకు అనుకూలంగా తీర్పు వస్తుందని ఆశిస్తున్నానని పేస్ అభిప్రాయపడ్డాడు. కుమార్తె సంరక్షణ బాధ్యతల విషయంలో టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్, అతని సహచర భాగస్వామి రియా పిళ్లై మధ్య వివాదం మరింత ముదురుతోంది. ఇంట్లో బంధించి తాళం వేసినట్టు పేస్‌పై బాంద్రా పోలీసులకు రియా ఫిర్యాదు చేసింది. దీంతో పేస్ వివరణ ఇచ్చాడు.

  • Loading...

More Telugu News