: సీమాంధ్రలో సైకిల్...తెలంగాణలో కారు జోరు
స్థానిక సంస్థల ఎన్నికల ఓట్ల లెక్కింపు జోరుగా కొనసాగుతోంది. ఇప్పటి వరకు వెలువడిన ఫలితాలను బట్టి సీమాంధ్రలో టీడీపీ జోరుమీద ఉండగా, తెలంగాణలో టీఆర్ఎస్ ముందంజలో ఉంది. సీమాంధ్రలో టీడీపీ 676 స్థానాల్లో గెలుపొందగా, వైఎస్సార్సీపీ 577 స్థానాల్లో పైచేయి సాధించింది. కాంగ్రెస్ కేవలం 19 స్థానాల్లో మాత్రమే గెలిచింది. కాగా తెలంగాణలో టీఆర్ఎస్ 245 స్థానాల్లో గెలుపొందగా, కాంగ్రెస్ 239 స్థానాల్లో పైచేయి సాధించింది. టీడీపీ 106 స్థానాల్లో తన సత్తా చాటింది.