: ఆ ఇద్దరు జర్నలిస్టులను భారత్ పంపొద్దు


దేశంలోని ఇద్దరు భారతీయ జర్నలిస్టులు తిరిగి స్వదేశానికి వెళ్లిపోవాలన్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ద పాకిస్థాన్ - ఇండియా పీపుల్స్ ఫోరమ్ ఫర్ పీస్ అండ్ డెమెక్రసీ (పీఐపీఎఫ్పీడీ) పాకిస్థాన్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ముంబైలో పీఐపీఎఫ్పీడీ కార్యాలయ ప్రతినిధులు ఆశా హన్స్, జతిన్ దేశాయి మాట్లాడుతూ...పాకిస్థాన్లో విధులు నిర్వర్తిస్తున్న మీనా మీనన్ (ద హిందూ), ఎస్.ఫిలప్ (పీటీఐ)ల వీసా గడువును పొడిగించాలని కోరారు.

భారత్లో సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న ప్రస్తుత తరుణంలో జర్నలిస్టులను స్వదేశాలకు వెళ్లిపోవాలని ఆదేశించడం సరికాదని వారు హితవు పలికారు. వీసా విధానంలో మరిన్ని అంశాలపై భారత్, పాక్ దేశాలు ఓ అవగాహనకు రావల్సిన అవశ్యకత ఉందని వారు అభిప్రాయపడ్డారు. మీనా మీనన్, ఫిలిప్లకు న్యాయం జరగుతుందని తాము ఆశిస్తున్నామని అన్నారు. వీరి గడువు ఈ ఏడాది మార్చితో ముగిసింది. దీంతో వారిద్దర్నీ వారం రోజుల్లోగా స్వదేశం వెళ్లిపోవాలని పాక్ ప్రభుత్వ ఆదేశించిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News